సరికొత్త భారత్‌ నా కల

నాకొక సరికొత్త భారత్‌ను నిర్మించాలన్న కల ఉంది. అందులో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు. ఏ ఒక్క మహిళా అభద్రతాభావంతో బతకకూడదు. ప్రతి ఒక్క చిన్నారికీ విద్యాఫలాలు అందాలి. అందరికీ సమాన అవకాశాలు, గౌరవం దక్కాలి.

Published : 16 Aug 2022 06:42 IST

నాకొక సరికొత్త భారత్‌ను నిర్మించాలన్న కల ఉంది. అందులో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు. ఏ ఒక్క మహిళా అభద్రతాభావంతో బతకకూడదు. ప్రతి ఒక్క చిన్నారికీ విద్యాఫలాలు అందాలి. అందరికీ సమాన అవకాశాలు, గౌరవం దక్కాలి. ప్రజలను విభజించే శక్తులకు చోటుండకూడదు. అలాంటి కలల భారత్‌ కోసం శాయశక్తులా కృషి చేస్తాను.

- మమతా బెనర్జీ


నరేంద్ర మోదీకి అభినందనలు

భారత దేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తూనే ఆరోగ్య రంగానికి, డిజిటల్‌ విప్లవ ఫలాలను అందిపుచ్చుకొనేందుకు ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నాను. ఆ రంగాల్లో భారత్‌ పురోగతి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగస్వామి కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను.

- బిల్‌ గేట్స్‌


 

మహిళాశక్తిపై ప్రధాని మాట పాటిద్దాం

వచ్చే 25 ఏళ్లలో దేశ గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేది ‘మాతృ శక్తి’ అని ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఉద్ఘాటించారు. కాబట్టి మహిళలకు ఎక్కడా అవమానం జరక్కుండా వారి గౌరవాన్ని కాపాడేలా ప్రతిజ్ఞ చేద్దాం.

- అమిత్‌ షా


రెండు దేశాల మధ్య ఎంతో అంతరం

75 ఏళ్ల క్రితం రెండు దేశాలకు (భారత్‌, పాకిస్థాన్‌) స్వాతంత్య్రం వచ్చింది. ఒకటేమో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మరొకటి సంక్షోభం అంచున ఉంది. సాంకేతికత, ఐటీ, సైన్స్‌ రంగాల్లో ఒక దేశం దూసుకుపోతుంటే, మరొకటి ఉగ్రవాదానికి కేంద్రంగా మారింది. ఒక దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉంటే, మరోచోట రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది.

- హర్ష్‌ గోయెంకా

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని