ప్రసూతి సెలవు చట్టబద్ధమైన హక్కు.. కాదనలేం: సుప్రీం

పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవు చట్టబద్ధమైన హక్కని, ఇతరత్రా కారణాలతో దీన్ని కాదనలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగి ఇద్దరు పిల్లల వరకు

Published : 17 Aug 2022 04:05 IST

దిల్లీ: పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవు చట్టబద్ధమైన హక్కని, ఇతరత్రా కారణాలతో దీన్ని కాదనలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగి ఇద్దరు పిల్లల వరకు ప్రసూతి సెలవులు వాడుకోవచ్చు. ఉద్యోగం పేరుతో మాతృత్వానికి దూరం కానవసరం లేదని మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు పెట్టిన ఈ సెలవుల మంజూరులో తలెత్తుతున్న ఇబ్బందుల వలన మహిళలు ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తోందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం.. శ్రామిక మహిళల జీవితంలో ఓ సహజ అంశంగా ప్రసవాన్ని అర్థం చేసుకోవాలని అభిప్రాయపడింది. చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ పిటిషను విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని