పసికందు మృతదేహంతో జైలు వద్ద మహిళ నిరీక్షణ

ఆ మహిళ గర్భం దాల్చానని సంబరపడింది. ఈలోపే భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినా ఆ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. అనారోగ్యంతో బిడ్డ చనిపోయాడు. పిల్లాడి

Published : 17 Aug 2022 04:05 IST

ఆ మహిళ గర్భం దాల్చానని సంబరపడింది. ఈలోపే భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినా ఆ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. అనారోగ్యంతో బిడ్డ చనిపోయాడు. పిల్లాడి మృతదేహాన్ని అయినా భర్తకు చూపిద్దామని జైలుకు వెళ్లింది. 7 గంటలకు పైగా అధికారులను వేడుకుంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ బతిమిలాడినా అధికారులు లోపలకి అనుమతించక పోవడంతో చేసేది లేక బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించింది. ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. జైలు నియమాల ప్రకారం ఆదివారం ఖైదీలను ఎవరూ కలిసే అవకాశం లేనందున, ఆ మహిళ తన భర్తను కలవలేకపోయిందని జైలు అధికారి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని