సైనికుడైన తండ్రికి వేణుగానంతో చిన్నారి నివాళి

దేశమంతా స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాకు చెందిన హనీ అనే బాలిక సైనికుడిగా పనిచేసిన తండ్రి సమాధి ముందు వేణువుతో జాతీయగీతం ఆలపించింది

Published : 17 Aug 2022 07:35 IST

దేశమంతా స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాకు చెందిన హనీ అనే బాలిక సైనికుడిగా పనిచేసిన తండ్రి సమాధి ముందు వేణువుతో జాతీయగీతం ఆలపించింది. గౌడహళ్లి గ్రామవాసి, విశ్రాంత సైనికుడైన నవీన్‌ ఓ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచీ ఆయన కుటుంబం ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నివాళులర్పిస్తోంది. సోమవారం నవీన్‌ సమాధి ముందు హనీ వేణువుతో జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అంజలి ఘటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు