ప్రేమను అంగీకరించలేదని.. తండ్రినే జైలుకు పంపిన కుమార్తె

తన ప్రేమను కాదన్నాడని ఓ బాలిక తండ్రిపైనే అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో అయిదున్నర సంవత్సరాలపాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్ర అంధేరీలోని డీఎన్‌ నగర్‌ పోలీస్‌స్టేషను

Updated : 17 Aug 2022 11:15 IST

ఐదేళ్ల తర్వాత నిర్దోషిగా తేలడంతో విడుదల

తన ప్రేమను కాదన్నాడని ఓ బాలిక తండ్రిపైనే అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో అయిదున్నర సంవత్సరాలపాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్ర అంధేరీలోని డీఎన్‌ నగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో జరిగింది. అసలేమైందంటే.. కుమార్తె ప్రియుడి వెంట తిరగడం ఆ తండ్రికి నచ్చలేదు. హెచ్చరించాడు.. ఆమె బేఖాతరు చేసింది. కోపంతో తండ్రి  కొట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న బాలిక తనపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 2017లో పాఠశాల టీచరుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. అవి తప్పుడు ఆరోపణలని తెలియని టీచరు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక తండ్రి 2017లో అరెస్టు అయ్యాడు. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. వైద్యపరీక్షలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడి కాలేదు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో తనను తాకినట్లు అనిపిస్తోందని, పీడకలలు వస్తున్నాయని బాల్యంలోనే ఆమె తన నోట్‌బుక్‌లో రాసుకుంది. బాలిక మానసిక పరిస్థితి బాగోలేక అలా చెప్పిందని తేలింది. దీంతో బాలిక తండ్రిని నిర్దోషిగా తేల్చి, అతని విడుదలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని