విమానంలో ధూమపానం.. బాబీ కటారియాపై కేసు నమోదు

ఓ స్పైస్‌జెట్‌ విమానం లోపల బాడీబిల్డర్‌ బల్వంత్‌ కటారియా అలియాస్‌ బాబీ కటారియా సిగరెట్‌ కాల్చిన వీడియో బయటకు రావడంతో దిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు

Published : 17 Aug 2022 05:51 IST

దిల్లీ: ఓ స్పైస్‌జెట్‌ విమానం లోపల బాడీబిల్డర్‌ బల్వంత్‌ కటారియా అలియాస్‌ బాబీ కటారియా సిగరెట్‌ కాల్చిన వీడియో బయటకు రావడంతో దిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. భద్రతా ప్రమాణాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినట్లు అతనిపై దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు స్టేషన్‌లో స్పైస్‌జెట్‌ మేనేజర్‌ (లీగల్‌, కంపెనీ వ్యవహారాలు) జస్బీర్‌ సింగ్‌ ఈనెల 13న ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌ నుంచి దిల్లీకి వచ్చే విమానంలో కటారియా ధూమపానం చేస్తున్న ఫొటోలు, వీడియోలను అతనే సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని