Updated : 18 Aug 2022 07:53 IST

Gautam Adani: గౌతమ్‌ అదానీకి ‘జడ్‌’ కేటగిరీ భద్రత

దిల్లీ: పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీకి అత్యంత ప్రముఖులకు కల్పించే ‘జడ్‌’ కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)కి చెందిన కమెండోలు ఆయన భద్రత బాధ్యతలను చేపడతారు. ఇందుకు నెలకు సుమారు రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఆ మొత్తాన్ని అదానీ చెల్లిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిఘా సంస్థలు రూపొందించిన ప్రాణ హాని, బెదిరింపులకు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో గౌతమ్‌ అదానీ పేరు కూడా ఉండడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీకి కేంద్ర ప్రభుత్వం 2013లో ‘జడ్‌+’ కేటగిరీ భద్రతను కేటాయించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని