Updated : 18 Aug 2022 07:24 IST

UP: వినికిడిలోపం ఉన్న బిడ్డకు రైలుకూత చికిత్స!

ర్నెల్ల పసికందుకు వినికిడిలోపం ఉండగా.. ఆ బిడ్డకు వింతచికిత్స చేయించే ప్రయత్నం చేశాడు ఓ తండ్రి. ఒడిలో కుమారుణ్ని పెట్టుకొని రైలుకు అడ్డంగా వెళ్లాడు. పట్టాలపై నిల్చొని కదిలేది లేదని మంకుపట్టు పట్టాడు. రైలుకూత శబ్దం వింటే బిడ్డకు లోపం నయమవుతుందన్నది ఆ తండ్రి తాపత్రయం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా గంజ్‌ మొరాదాబాద్‌ సమీపంలో జరిగింది. పట్టాలపై వ్యక్తి ఉండటాన్ని గమనించిన లోకో పైలట్‌.. రైలును ఆపేశాడు. స్థానికులు ఎంతచెప్పినా పక్కకు జరిగేది లేదంటూ పిల్లాడి తండ్రి మొండికేశాడు. లోకో పైలట్‌ రైలు దిగివచ్చి బతిమిలాడినా ఫలితం లేకపోయింది. రైలుకూత వినిపిస్తేనే కదులుతానని చెప్పాడు. ఇక చేసేదిలేక ఆ డిమాండుకు సరేనంటూ రైలు హారన్‌ మోగించాడు లోకో పైలట్‌. ఆ శబ్దం విన్న తర్వాతే తండ్రి పట్టాల పైనుంచి పక్కకు వెళ్లాడు. బిడ్డ స్పందన తెలియదు గానీ.. ఈ ఘటనను స్థానికులు ఫోన్లలో బంధించి వైరల్‌ చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని