Published : 18 Aug 2022 04:56 IST

విమానాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

దిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విమానాల్లోనూ కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) బుధవారం ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రయాణికులంతా తప్పనిసరిగా తగినవిధంగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. వివిధ స్థాయిల్లో శానిటైజేషన్‌ చేయాలని పేర్కొంది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో.. దేశవ్యాప్తంగా విమానాల్లో కొవిడ్‌ నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు తనిఖీలు (ర్యాండమ్‌ చెక్స్‌) నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రయాణికులెవరైనా నిర్దేశిత నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని