Published : 18 Aug 2022 05:19 IST

భార్యను మరో మహిళతో పోల్చడం మానసిక క్రూరత్వమే

కేరళ హైకోర్టు స్పష్టీకరణ

కొచ్చి: భార్యను మరో మహిళతో పోల్చడం, తాను అనుకున్న స్థాయిలో ఆమె లేదని నిత్యం అవమానించడం మానసిక క్రౌర్యం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు పేర్కొంది. అలాంటి భర్తతో భార్య కాపురం చేయనక్కర్లేదని తీర్పు చెప్పింది. 13 ఏళ్ల నుంచి విడివడి ఉంటున్న భార్యాభర్తలకు కుటుంబ న్యాయస్థానం ఇదివరకే విడాకులు మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ భర్త హైకోర్టుకు వెళ్లారు. వీరిద్దరికీ 2009 జనవరిలో పెళ్లయింది. అదే సంవత్సరం నవంబరులో విడాకుల కోసం భార్య కుటుంబ కోర్టుకు అర్జీ పెట్టుకుంది. తాము కనీసం నెల రోజులైనా కాపురం చేయలేదనీ, అందంగా లేనంటూ తనతో శారీరకంగా కలవడానికీ భర్త నిరాకరించాడని పిటిషనర్‌ కుటుంబ న్యాయస్థానానికి తెలిపింది. అందుబాటులో ఉన్న ఆధారాలూ ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయని కేరళ హైకోర్టు పేర్కొంది. వీరిది పేరుకే పెళ్లి అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తల మధ్య శారీరక, మానసిక బంధం లేదని కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేయగా, భార్యను భర్త మానసికంగా హింసించాడనే కారణంపై విడాకులను హైకోర్టు నిర్ధారించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని