Published : 18 Aug 2022 05:19 IST

పీఎం2.5 అత్యంత కాలుష్యం ఇక్కడే..

20 నగరాల్లో 18 భారత్‌లోనే..
అమెరికా సంస్థ అధ్యయనం వెల్లడి

దిల్లీ: కాలుష్య కారక అతి సూక్ష్మకణాల (పీఎం2.5) అత్యంత తీవ్రస్థాయికి పెరిగిన 20 నగరాలకు గాను 18 భారత్‌లోనే ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం, ఆరోగ్యంపై పడుతున్న ప్రభావంపై 7 వేలకు పైగా నగరాల్లో నిర్వహించిన సమగ్ర అధ్యయన వివరాలను అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ ‘హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌ఈఐ)’ వెల్లడించింది. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలకు గాను అతిసూక్ష్మ కణ కాలుష్య కారకాల సగటు స్థాయి దిల్లీలో అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. 2010 నుంచి 2019 వరకూ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. అధ్యయనంలో భాగంగా అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలైన పీఏం2.5, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ (ఎన్‌ఓ2)లపై ప్రధానంగా దృష్టి సారించారు. పీఎం2.5 కారణంగా 7,239 నగరాల్లో 1.7 కోట్ల మంది మరణించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా, తూర్పు, మధ్య ఐరోపా దేశాల్లో అత్యధిక ఆరోగ్య దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అధ్యయనంలో వెల్లడించిన వివరాలివి..

ప్రపంచవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో అత్యంత కాలుష్య నగరాలు 103 ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో అధిక జనాభా ఉన్న నగరాలకు గాను.. పీఎం2.5 కాలుష్య కారక వ్యాధుల తీవ్రత ఉన్న మొదటి పదింటిలో (2019లో) దిల్లీ, కోల్‌కతాలు ఉన్నాయి.

భారత్‌, నైజీరియా, పెరూ, బంగ్లాదేశ్‌లలోని వివిధ నగరాల్లో ప్రజలు ప్రపంచ సగటు కంటే ఎన్నో రెట్లు పీఏం2.5తో ఇబ్బందులు పడుతున్నారు.

భారత్‌, ఇండొనేసియాల్లో ‘పీఎం 2.5’ ప్రమాదకరస్థాయిలో పెరిగిపోతుండగా, కాలుష్యాన్ని నియంత్రించడంలో చైనా పురోభివృద్ధి సాధించింది.

అధ్యయనం జరిపిన 7 వేలకు పైగా నగరాలకు గాను ‘పీఎం2.5’ అత్యంత తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న తొలి 20 ప్రాంతాల్లో 18 భారత్‌కు చెందినవి ఉండగా మిగిలిన రెండూ ఇండొనేసియాలో ఉన్నాయి

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని