Updated : 18 Aug 2022 06:05 IST

హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

పిల్‌లపై చర్యలు చేపట్టవద్దని ఆదేశం

దిల్లీ: గనుల తవ్వకానికి సంబంధించిన ఆరోపణల విషయంలో ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గనుల శాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు తనకు తానే ఒక గని లీజును మంజూరు చేసుకున్నారని, దానిపై విచారణ జరపాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని విచారణయోగ్య వ్యాజ్యాలుగా హైకోర్టు పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ సోరెన్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాటిపై ఝార్ఖండ్‌ హైకోర్టు ఎలాంటి చర్య చేపట్టకుండా సర్వోన్నత న్యాయస్థానం నిలువరించింది. తీర్పును రిజర్వ్‌ చేసింది. పెండింగ్‌ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి చర్యలు చేపట్టరాదంది. గనుల మంత్రిగా ఉన్న వ్యక్తి తనకోసం తానే ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని