Updated : 18 Aug 2022 06:04 IST

రవాణారంగంలో కర్బన ఉద్గారాల కట్టడి

ఫ్రాన్స్‌తో ఒప్పందానికి కేంద్ర కేబినెట్‌ అనుమతి

దిల్లీ: దేశంలో రవాణా రంగం నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన నూతన సాంకేతికతలను సమకూర్చుకోవడానికి, అభివృద్ధిపరచుకోవడానికి గాను ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంపై జులై 6న రెండు దేశాలకు చెందిన ఆయా విభాగాల అధికారులు సంతకాలు చేశారు.

డిజిటల్‌ గ్రంథాలయాల్లో నిక్షిప్తపరిచిన భారతీయ సంప్రదాయ వైద్య విజ్ఞాన సమాచారాన్ని దేశీయ, అంతర్జాతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తగిన రుసుము చెల్లించి ఈ సమాచారాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తారు. పరిశోధక విద్యార్థులు, పరిశోధన సంస్థలకు ఉపయుక్తంగా ఉంటుందని, కొత్త అన్వేషణలకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని