Published : 18 Aug 2022 05:47 IST

మరణ శిక్షను తగ్గించేందుకు వీలుండే ప్రతి అవకాశాన్నీ నిందితుడికి ఇవ్వాలి

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: మరణ శిక్ష అమలైన తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం అసాధ్యం కనుక...నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఉండే ప్రతి అవకాశాన్నీ నిందితుడికి కల్పించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శిక్షను తగ్గించడానికి అవసరమైన కసరత్తుకు వీలుకల్పించేలా తీర్పును న్యాయస్థానాలు వాయిదా వేయవచ్చని జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ సుధాన్షు ధులియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం పేర్కొంది. నేర స్వభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిందితుడికి మరణ శిక్ష విధించాల్సిన అవసరంలేదనే నిర్ధారణకు వస్తే దానిని జీవిత ఖైదుగా మార్చే స్వేచ్ఛ కోర్టుకు ఉంటుందని తెలిపింది. ఒకవేళ మరణ శిక్షను విధించడానికి మరింత అదనపు సమాచారం లేదా నిర్ధారణలు అవసరమైతే అందుకు అవసరమైన చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది. ఉపశమన చర్యల మార్గదర్శకాలకు సంబంధించిన ఆదేశాన్ని ధర్మాసనం రిజర్వులో ఉంచింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని