Published : 18 Aug 2022 05:47 IST

అల్లోపతీపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

రామ్‌దేవ్‌ బాబాకు దిల్లీ హైకోర్టు సూచన

దిల్లీ: అల్లోపతీ వైద్యానికి వ్యతిరేకంగా ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు దిల్లీ హైకోర్టు సూచించింది. అధీకృతం కాని సమాచారాన్ని మాట్లాడొద్దని హితవు పలికింది. కొవిడ్‌ చికిత్స కోసం పతంజలి అందుబాటులోకి తీసుకొచ్చిన ‘కరోనిల్‌’ ఔషధ సామర్థ్యంపై రామ్‌దేవ్‌ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పలు వైద్యసంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి. కరోనా బాధితుల మృతికి అల్లోపతీయే కారణమని ఆయన ఆరోపించినట్లు అందులో పేర్కొన్నాయి. కరోనిల్‌తో కొవిడ్‌ పూర్తిగా నయమవుతుందని ప్రచారం చేస్తున్నారనీ తెలిపాయి. ఆ వ్యాజ్యంపై బుధవారం దిల్లీ హైకోర్టు విచారణ కొనసాగించింది. ‘‘మీకు అనుచరులు ఉండటం స్వాగతనీయమే. మీరు చెప్పిందల్లా వినే శిష్యులు ఉండటం మంచిదే. కానీ దయచేసి అధీకృతం కాని సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించకండి’’ అని రామ్‌దేవ్‌ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఆయుర్వేద వైద్యం ప్రతిష్ఠను కాపాడాలన్నదే తమ అభిమతమని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని