Published : 18 Aug 2022 05:47 IST

రోహింగ్యాలను ఈడబ్ల్యూఎస్‌ ఫ్లాట్లకు పంపే యోచన లేదు: హోంశాఖ

దిల్లీ: దేశ రాజధానిలోని రోహింగ్యా ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌) ఫ్లాట్లకు తరలించే యోచనేదీ లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అక్రమంగా ఉంటున్న విదేశీయులను చట్ట ప్రకారం సొంత దేశాలకు పంపించేవరకూ నిర్బంధ కేంద్రాల్లోనే (డిటెన్షన్‌ సెంటర్లు) ఉంచాలని దిల్లీ ప్రభుత్వానికి నిర్దేశించింది. అంతకుముందు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి ఇందుకు భిన్నంగా ట్వీట్‌ చేసిన నేపథ్యంలో దీనిపై కొద్ది గంటల్లోనే హోంశాఖ స్పష్టతనిస్తూ ప్రకటన విడుదల చేసింది. హర్‌దీప్‌ తన ట్వీట్‌లో.. ‘‘శరణార్థులై వచ్చినవారిని భారత్‌ ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ఈమేరకు రోహింగ్యాలను దిల్లీలోని బక్కర్‌వాలా ప్రాంతంలోని ఈడబ్ల్యూఎస్‌ ఫ్లాట్లకు తరలిస్తాం. వారికి మౌలిక వసతులతో పాటు పోలీసు రక్షణ కల్పిస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హోంశాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని