Published : 18 Aug 2022 05:47 IST

డోభాల్‌ భద్రతలో వైఫల్యం

ముగ్గురు కమాండోలకు ఉద్వాసన

దిల్లీ: జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ నివాసం వద్ద భద్రతలో వైఫల్యం చెందినందుకు సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ముగ్గురు కమాండోలపై కేంద్రం వేటు వేసింది. వీరిని సర్వీసు నుంచి తొలగించింది. జడ్‌ ప్లస్‌ శ్రేణిలో ఉన్న డోభాల్‌కు సీఐఎస్‌ఎఫ్‌లోని ప్రత్యేక విభాగం భద్రత కల్పిస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తన కారుతో డోభాల్‌ నివాసంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకుని దిల్లీ పోలీసులకు అప్పగించారు. అతనికి మతి స్తిమితం లేదని పోలీసులు తేల్చారు. అయితే ఆనాటి ఘటనపై సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ నిర్వహించారు. వివిధ రూపాల్లో ఐదుగురి అలసత్వం కారణంగా ఆనాటి ఘటన చోటు చేసుకుందని దానిలో తేలింది. ముగ్గురు కమాండోలను డిస్మిస్‌ చేసి, వీవీఐపీల భద్రత విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డీఐజీని, సీనియర్‌ కమాండెంట్‌ స్థాయి అధికారిని బదిలీ చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని