Published : 18 Aug 2022 05:47 IST

ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా సునీల్‌కుమార్‌ గుప్తా

ఈనాడు, దిల్లీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కార్యదర్శిగా పశ్చిమబెంగాల్‌ కేడర్‌ 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేసేంతవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు ఈ స్థానంలో 1979 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఐవీ సుబ్బారావు ఉన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులైనప్పుడు ఆయన ఈ స్థానంలోకి వచ్చారు. ప్రస్తుతం వెంకయ్య పదవీకాలం పూర్తికావడంతో కొత్త ఉపరాష్ట్రపతికి కొత్త కార్యదర్శిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని