Published : 18 Aug 2022 05:47 IST

పంజాబ్‌లో 2.7 కిలోల ఆర్‌డీఎక్స్‌ స్వాధీనం

పంజాబ్‌లో కేంద్ర నిఘాసంస్థ పోలీసు అధికారి ఇంటి వద్ద పేలుడు పదార్థాలు దొరకడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్‌ అవెన్యూ ప్రాంతంలో ఉంటున్న సీఐఏ ఎస్‌ఐ దిల్‌బాగ్‌సింగ్‌ నివాసం వద్ద 2.7 కిలోల ఆర్‌డీఎక్స్‌ను పంజాబ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనివెనక ఉగ్రకుట్ర ఉన్నట్లు అదనపు డీజీ డోఖే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అమృత్‌సర్‌ పోలీసులు ఈ ఘటనతో అప్రమత్తమై వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పంద్రాగస్టు వేడుకలకు ముందు.. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్తోళ్లు, 40 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను పంజాబ్‌, దిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని