Published : 18 Aug 2022 05:47 IST

ప్రధాని మోదీతో స్టాలిన్‌ భేటీ

చెన్నై, న్యూస్‌టుడే: దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. నీట్‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు, కొత్త విద్యావిధానం, కావేరీ జలవివాదం, మేకెదాటుపై ఆనకట్ట నిర్మాణానికి కర్ణాటక యత్నాలు, విద్యుత్తు చట్ట సవరణ బిల్లు తదితర అంశాలపై సీఎం ప్రధానికి మెమొరాండం సమర్పించినట్లు తెలిసింది. 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు ప్రధానికి కృతజ్ఞత చెబుతూ ‘హోం ఆఫ్‌ చెస్‌’ పుస్తకాన్ని సీఎం బహూకరించారు. రాష్ట్రంలో సంప్రదాయ వరి వంగడాల కిట్‌నూ మోదీకి అందించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని