Published : 18 Aug 2022 05:47 IST

శబరిమలకు పోటెత్తిన భక్తులు

మలయాళ కొత్త సంవత్సర ప్రత్యేక పూజలు

శబరిమల: మలయాళ నూతన సంవత్సరాది.. చింగమ్‌ నెల ప్రారంభం సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయానికి బుధవారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయానికే వేల సంఖ్యలో భక్తులు శబరిమల కొండపైకి చేరుకున్నారు. అయ్యప్ప స్వామి శరణుఘోషతో భక్తుల పారవశ్యం మధ్య ప్రధాన పూజారి ఎన్‌.పరమేశ్వరన్‌ నంబూద్రి గర్భగుడి తలుపులు తెరిచారు. దీపాలు వెలిగించి.. స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక ‘లక్షార్చన’ పూజలు జరిపినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈమేరకు ఐదు రోజుల పాటు (ఆగస్టు 21 వరకు) దేవాలయాన్ని తెరిచి ఉంచుతారు. అనంతరం ఓనమ్‌ సందర్భంగా సెప్టెంబరు 6న మళ్లీ ఆలయాన్ని తెరిచి.. 10వ తేదీన మూసివేస్తారని దేవస్థానం తెలిపింది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని