దోషుల్లో కొందరు సంస్కారవంతులైన బ్రాహ్మణులు

బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో శిక్షపడిన దోషుల్లో కొందరు ‘సంస్కారవంతులైన బ్రాహ్మణులు’ ఉన్నారనీ, వారి కుటుంబాల గత కార్యకలాపాల కారణంగా కేసులో ఇరికించి ఉంటారని గోధ్రా నియోజకవర్గ భాజపా

Published : 19 Aug 2022 04:51 IST

గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే వ్యాఖ్య

అహ్మదాబాద్‌: బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో శిక్షపడిన దోషుల్లో కొందరు ‘సంస్కారవంతులైన బ్రాహ్మణులు’ ఉన్నారనీ, వారి కుటుంబాల గత కార్యకలాపాల కారణంగా కేసులో ఇరికించి ఉంటారని గోధ్రా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే సికె.రౌల్జీ పేర్కొన్నారు. దోషులు 11 మందిని జైలు నుంచి విడుదల చేయాలని సిఫార్సు చేసిన ప్రభుత్వ కమిటీలో ఆయనొకరు. 15 ఏళ్లుగా జైల్లో గడిపి విడుదలైనవారు నేరంలో పాల్గొన్నారో లేదో తనకు తెలియదని రౌల్జీ చెప్పారు. కారాగారంలో వారి ప్రవర్తన ఎలా ఉందనేది జైలర్‌ నుంచి తెలుసుకుని, విడుదలకు సిఫార్సు చేశామనీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించామని ఒక పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని