ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన విద్యార్థులకు కొత్త చిక్కు!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో 6 నెలల క్రితం తిరిగివచ్చిన భారత విద్యార్థులకు కొత్త సవాల్‌ ఎదురైంది. తాజాగా కొన్ని విశ్వవిద్యాలయాలు ఆఫ్‌లైన్‌ తరగతులను తిరిగి ప్రారంభించడానికి

Published : 19 Aug 2022 04:49 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో 6 నెలల క్రితం తిరిగివచ్చిన భారత విద్యార్థులకు కొత్త సవాల్‌ ఎదురైంది. తాజాగా కొన్ని విశ్వవిద్యాలయాలు ఆఫ్‌లైన్‌ తరగతులను తిరిగి ప్రారంభించడానికి నిర్ణయించడంతో వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఈమేరకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు సెప్టెంబరు నుంచి తరగతులను పునరుద్ధరిస్తున్నట్లు విద్యార్థులకు సమాచారం అందించాయి. తప్పక రాయాల్సిన ‘క్రోక్‌’ పరీక్షను కూడా అక్టోబరులో ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఉక్రెయిన్‌ నిబంధనల ప్రకారం వైద్య, దంతవైద్య, ఫార్మసీ విదార్థులు మూడో సంవత్సరంలో ‘క్రోక్‌-1’కు హాజరు కావాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం తర్వాత దేశంలో లైసెన్సు పొందేందుకు ‘క్రోక్‌-2’ రాయాల్సి ఉంటుంది. 6 నెలలుగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించనున్నట్లు సమాచారం అందడంతో నిర్ఘాంతపోతున్నారు. భద్రతకు హామీ ఇస్తున్నట్లు కూడా ఆ సమాచారంలో పేర్కొన్నట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏంచేయాలోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధంతో దాదాపు 20 వేల మంది భారత్‌కు చెందిన వైద్య విద్యార్థులు ఈ ఏడాది మార్చిలో తిరిగివచ్చిన సంగతి తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని