మైనర్‌ను కార్యకర్తగా నియమించుకున్నందుకు ఆప్‌పై చర్యలు తీసుకోండి

మైనర్‌ను కార్యకర్తగా నియమించుకున్నందుకుగాను గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర డీజీపీకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ

Published : 19 Aug 2022 04:49 IST

గుజరాత్‌ డీజీపీకి ఎన్‌సీపీసీఆర్‌ లేఖ

దిల్లీ: మైనర్‌ను కార్యకర్తగా నియమించుకున్నందుకుగాను గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర డీజీపీకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) గురువారం లేఖ రాసింది. 11 ఏళ్ల ఓ బాలుడిని నిరసన కార్యక్రమాల్లో పార్టీ వాడుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది. ఆప్‌ గుజరాత్‌ విభాగం అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా, ఆ పార్టీకే చెందిన మరో నేత ఇసుడాన్‌ గధ్వీ రాజకీయ ప్రయోజనాల కోసం అతణ్ని ఉపయోగించుకున్నారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని