నేతాజీ అస్థికల విషయంలో భారత్‌, జపాన్‌లను సంప్రదిస్తా

జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలంటూ భారత్‌, జపాన్‌ ప్రభుత్వాలను సంప్రదిస్తానని ఆయన కుమార్తె అనితా బోస్‌ తెలిపారు. అస్థికలను

Published : 19 Aug 2022 04:49 IST

కుమార్తె అనితా బోస్‌ వెల్లడి

కోల్‌కతా: జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలంటూ భారత్‌, జపాన్‌ ప్రభుత్వాలను సంప్రదిస్తానని ఆయన కుమార్తె అనితా బోస్‌ తెలిపారు. అస్థికలను జపాన్‌ నుంచి తెప్పించి, ఆయన మరణం వెనక ఉన్న మిస్టరీని ఛేదించడమే స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆమె పేర్కొన్నారు. గురువారం ఆమె జర్మనీ నుంచి ఫోన్లో పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని