త్వరలో సరికొత్తగా కొవిన్ పోర్టల్
ప్రస్తుతం కొవిడ్-19 టీకాల నమోదు, ధ్రువపత్రాల జారీకే పరిమితమైన కొవిన్ పోర్టల్ పరిధి మరింత విస్తృతం కానుంది. సార్వజనిక టీకా కార్యక్రమ(యూఐపీ) వివరాలను పొందుపరిచిన
దిల్లీ: ప్రస్తుతం కొవిడ్-19 టీకాల నమోదు, ధ్రువపత్రాల జారీకే పరిమితమైన కొవిన్ పోర్టల్ పరిధి మరింత విస్తృతం కానుంది. సార్వజనిక టీకా కార్యక్రమ(యూఐపీ) వివరాలను పొందుపరిచిన సరికొత్త కొవిన్ పోర్టల్ సెప్టెంబరు రెండో వారంలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత దశల్లో రక్తం, అవయవాల దానం వివరాలనూ జత చేయనున్నారు. పునర్వ్యవస్థీకరించిన కొవిన్ పోర్టల్‌ను తొలుత ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రెండేసి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారని అధికారులు తెలిపారు. మూడు నెలల తర్వాత కొత్త పేరుతో జాతీయ స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమమైన...యూఐపీ ద్వారా చిన్నారులు, గర్భిణులకు 12 రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్లు ఉచితంగా అందుతున్నాయి. దీనికి సంబంధించిన రికార్డుల నిర్వహణ ప్రస్తుతం సాధారణ పద్ధతుల్లోనే కొనసాగుతోంది. కొవిన్ పోర్టల్‌తో యూఐపీని జత చేసిన తర్వాత రికార్డుల నిర్వహణ సహా యావత్తు టీకా వ్యవస్థను డిజిటలీకరిస్తారు. దీంతో లబ్ధిదారుల నమోదు, గుర్తింపు చాలా సులభం అవుతుంది. టీకా కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదవుతాయి. తక్షణమే వాటి పురోగతి స్థాయినీ తెలుసుకునేందుకు వీలవుతుంది. టీకా తీసుకోదలచిన వ్యక్తులు ముందస్తుగా స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. టీకా పొందిన వెంటనే ధ్రువీకరణ పత్రం కూడా డౌన్లోడ్ అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్