లఖింపుర్‌ఖేరీలో రైతుల ధర్నా

కేంద్ర మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రను తొలగించాలని తదితర డిమాండ్లతో పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన రైతులు గురువారం 3 రోజుల ధర్నా చేపట్టారు. గత ఏడాది లఖింపుర్‌

Published : 19 Aug 2022 04:49 IST

లఖింపుర్‌ఖేరీ: కేంద్ర మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రను తొలగించాలని తదితర డిమాండ్లతో పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన రైతులు గురువారం 3 రోజుల ధర్నా చేపట్టారు. గత ఏడాది లఖింపుర్‌ ఖేరీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కేసులో మంత్రి కుమారుడు నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా కనీస మద్దతు ధరకు చట్టాన్ని తీసుకురావాలని కూడా రైతులు డిమాండ్‌ చేశారు. లఖింపుర్‌ఖేరీలో చేపట్టిన ఈ ధర్నాలో మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడులకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌-టికాయిత్‌తో పాటు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం)కు చెందిన వివిధ సంఘాలు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా రైతులకు న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని