దేశాభివృద్ధికి విద్యార్థుల సహకారం కీలకం

దేశ ప్రగతికి విద్యార్థుల సహకారం కీలకమని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన వేలూర్‌ వీఐటీ 37వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8,168 మంది విద్యార్థులకు పట్టాలను

Updated : 19 Aug 2022 06:23 IST

వీఐటీ స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌

వేలూర్‌, న్యూస్‌టుడే: దేశ ప్రగతికి విద్యార్థుల సహకారం కీలకమని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన వేలూర్‌ వీఐటీ 37వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8,168 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. వైఫల్యాలను ఎదుర్కోవడానికి విద్యార్థులు కొత్తగా ఆలోచించాలని సూచించారు. విద్యపై ఎక్కువ పెట్టుబడి పెడితే అభివృద్ధి సాధ్యమని కులపతి జి.విశ్వనాథ]న్‌ పేర్కొన్నారు. విద్యపై కేరళ భారీ పెట్టుబడి పెడుతోందని, బిహార్‌లో ఇది తక్కువగా ఉందని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 14కోట్ల మంది ఉన్నత విద్యకు అర్హులు కాగా, అందులో మూడున్నర కోట్లమంది మాత్రమే అభ్యసించారని చెప్పారు. వీఐటీ విద్యాపరంగా ప్రస్తుతం దేశంలో 3, ప్రపంచంలో 600కు సమీపంలోని ర్యాంకుల్లో ఉందని తెలిపారు. ప్రపంచంలో తొలి 200 స్థానాల్లోకి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ సేతురామన్‌ పంచనాథన్‌, సైన్స్‌ టెక్నాలజీ శాఖ సెక్రటరీ చంద్రశేఖర్‌, చెన్నైలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్‌ జూడిత్‌రావు, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాథన్‌, శేఖర్‌ విశ్వనాథన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు సంధ్యా పెండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని