దళిత ఉపాధ్యాయురాలి సజీవ దహనం కేసు..

అప్పు తిరిగి చెల్లించమన్నందుకు దళిత ఉపాధ్యాయురాలిని సజీవ దహనం చేసిన ఘటనపై నివేదిక ఇవ్వాలని షెడ్యూల్డ్‌ కులాల జాతీయ మండలి(ఎన్‌సీఎస్‌సీ) రాజస్థాన్‌ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ,

Published : 19 Aug 2022 04:51 IST

రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఎన్‌సీఎస్‌సీ నోటీసు

దిల్లీ: అప్పు తిరిగి చెల్లించమన్నందుకు దళిత ఉపాధ్యాయురాలిని సజీవ దహనం చేసిన ఘటనపై నివేదిక ఇవ్వాలని షెడ్యూల్డ్‌ కులాల జాతీయ మండలి(ఎన్‌సీఎస్‌సీ) రాజస్థాన్‌ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ, బాధితురాలికి చెల్లించే పరిహారం, దరాప్తు పురోగతిపై వారం రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)ని ఆదేశించింది. లేని పక్షంలో సీఎస్‌ వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. జైపుర్‌లో ఈ నెల 10న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఆమె బంధువులు పెట్రోల్‌ పోసి తగలబెట్టగా చికిత్స పొందుతూ బుధవారం మరణించిన సంగతి తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని