అనాయాస మరణం ఆపాలన్న పిటిషన్‌ ఉపసంహరణ

దీర్ఘకాల నరాల రుగ్మతతో బాధపడుతున్న తన స్నేహితుడు అనాయాస మరణం పొందేందుకు వైద్యచికిత్స పేరిట స్విట్జర్‌లాండ్‌ వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ ఓ మహిళ (49) దిల్లీ

Published : 19 Aug 2022 04:51 IST

దిల్లీ: దీర్ఘకాల నరాల రుగ్మతతో బాధపడుతున్న తన స్నేహితుడు అనాయాస మరణం పొందేందుకు వైద్యచికిత్స పేరిట స్విట్జర్‌లాండ్‌ వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ ఓ మహిళ (49) దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను గురువారం ఉపసంహరించుకున్నారు. పిటిషనరు తరఫు న్యాయవాది.. జస్టిస్‌ యశ్వంత్‌వర్మకు ఈ విషయం నివేదిస్తూ ‘గత వారం ఈ పిటిషను దాఖలు చేసిన సమయానికి ఆమె సందిగ్ధంలో ఉన్నారు. ఉపసంహరించుకోవాలని ఇపుడు కోరుతున్నారు’ అని తెలిపారు. ‘మియాల్జిక్‌ ఎన్‌సెఫలోమైయెలిటిస్‌ వ్యాధితో బాధపడుతున్న నా స్నేహితుడు పిటిషను గురించి తెలిసి చాలా ఆవేదనకు గురయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే ఆ రిట్‌ను దాఖలు చేయడంలోని ఉద్దేశమే వ్యర్థం కావచ్చని భయపడుతున్నా’ అంటూ ఆమె ప్రకటనను న్యాయవాది చదివి వినిపించారు. దీంతో కోర్టు పిటిషను ఉపసంహరణకు అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని