చోరీల్లో శతక రాణి అరెస్టు

పని మనిషిగా ఇంటిలో చేరుతుంది. యజమానుల కన్నుగప్పి చేతివాటం ప్రదర్శిస్తుంది. డబ్బు, బంగారు నగలతో విమానంలో ఉడాయిస్తుంది. ఇలా దిల్లీ, కోల్‌కతా, జోధ్‌పుర్‌ తదితర నగరాల్లో

Published : 19 Aug 2022 04:51 IST

గాజియాబాద్‌: పని మనిషిగా ఇంటిలో చేరుతుంది. యజమానుల కన్నుగప్పి చేతివాటం ప్రదర్శిస్తుంది. డబ్బు, బంగారు నగలతో విమానంలో ఉడాయిస్తుంది. ఇలా దిల్లీ, కోల్‌కతా, జోధ్‌పుర్‌ తదితర నగరాల్లో వందకు పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడిన పూనం షా అలియాస్‌ కాజల్‌ అనే మహిళను ఉత్తర్‌ప్రదేశ్‌ గాజియాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క దిల్లీలోనే ఆమె మీద 26 కేసులున్నాయని వారు చెప్పారు. చోరీ సొమ్ముతో దిల్లీలో స్థలం కొని ఇల్లు నిర్మించుకున్నట్లు తేలిందన్నారు. బిహార్‌కు చెందిన పూనం.. గాజియాబాద్‌లోని యజమాని ఇంట్లో రూ.10 లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసిన కేసులో విచారణ చేపట్టగా, ఆమె నేర చరిత్ర వెలుగలోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని