Street Dogs : ఆ గ్రామంలో కుక్కలకు రూ.కోట్ల ఆస్తి

ఆశ్చర్యంగా అనిపించినా నిజమే.. ఆ గ్రామంలోని కుక్కలకు రూ.కోట్ల ఆస్తి ఉంది. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా పాలన్‌పుర్‌ తాలూకా కుశాకల్‌ గ్రామ ప్రజలు వీధికుక్కల కోసం ఏకంగా 20 బీఘాల భూమి కేటాయించారు. ఎకరంలో మూడోవంతైన ఒక్క

Updated : 20 Aug 2022 07:00 IST

శ్చర్యంగా అనిపించినా నిజమే.. ఆ గ్రామంలోని కుక్కలకు రూ.కోట్ల ఆస్తి ఉంది. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా పాలన్‌పుర్‌ తాలూకా కుశాకల్‌ గ్రామ ప్రజలు వీధికుక్కల కోసం ఏకంగా 20 బీఘాల భూమి కేటాయించారు. ఎకరంలో మూడోవంతైన ఒక్క బీఘా భూమి విలువ అక్కడ సుమారు రూ.25 లక్షలు. అంటే మొత్తం భూమి విలువ దాదాపు రూ.5 కోట్లు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని శునకాల కోసమే ఖర్చు చేస్తూ.. ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు. గ్రామంలో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. అత్యధిక కుటుంబాలు వ్యవసాయం, పశు పోషణ మీద ఆధారపడినవే. నవాబుల ఏలుబడిలో వ్యవసాయం కోసం గ్రామస్థులకు ఇచ్చిన భూమిని కాలక్రమేణా వీధికుక్కలకు కేటాయించారు. భూమిని అందరూ కలిసి సాగు చేస్తారు. పండిన పంట మొత్తం కుక్కల కోసమే పక్కన పెడతారు. పండుగల సమయంలో శునకాలకూ మిఠాయిలు, ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కుక్కల ఆహారం తయారీకి గ్రామస్థులు పెద్ద పెద్ద పాత్రలను కొనుగోలు చేశారు. ఈ సంప్రదాయం తమ పూర్వీకుల కాలం నుంచి వస్తోందని కుశాకల్‌ గ్రామస్థుడు ప్రకాశ్‌ చౌదరి తెలిపారు. కుక్కల కోసం రోజూ 10 కిలోల పిండితో రొట్టెలు చేస్తామని హితేశ్‌ చౌదరి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు