శృంగారానికి పురుషుడి అవసరం లేదు

‘దియా ఔర్‌ బాతి హమ్‌’ టీవీ షోతో ప్రాచుర్యం పొంది, కొన్ని సినిమాల్లోనూ నటించిన కనిష్కా సోని తనను తానే పెళ్లాడినట్లు ఇన్‌స్టాగ్రాం ద్వారా చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపిట సిందూరం, మెడలో మంగళసూత్రాలతో ఉన్న

Published : 20 Aug 2022 04:11 IST

తనను తాను పెళ్లాడిన టీవీ నటి కనిష్కా సోని

ముంబయి: ‘దియా ఔర్‌ బాతి హమ్‌’ టీవీ షోతో ప్రాచుర్యం పొంది, కొన్ని సినిమాల్లోనూ నటించిన కనిష్కా సోని తనను తానే పెళ్లాడినట్లు ఇన్‌స్టాగ్రాం ద్వారా చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపిట సిందూరం, మెడలో మంగళసూత్రాలతో ఉన్న తన చిత్రాలను కూడా షేర్‌ చేసిన ఆమె ఎందుకిలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయి. ఓ మహిళ శృంగారానికి పురుషుడితో ఇక పని లేదు. నేను గుజరాత్‌కు చెందిన చాలా సంప్రదాయవాద కుటుంబం నుంచి వచ్చాను. పెళ్లి అనేది నా చిరకాల వాంఛ. కానీ, మాట మీద నిలబడే పురుషుడు ఎవరినీ నా జీవితంలో చూడలేదు. అందుకే పురుషుడు లేకుండానే జీవితం గడపాలన్న నిర్ణయానికి వచ్చాను. నా కలలు, అవసరాలు నేనే తీర్చుకోగలను. ‘మహాబలి హనుమాన్‌’ వంటి షోలలో నేను దేవతల వంటి పాత్రలు పోషించాను. ఎవరూ పెద్దగా గుర్తించలేదు. ఈరోజు నా ఇన్‌స్టాగ్రాం చూసి ఎంతోమంది స్పందిస్తున్నారు. వివాహిత మహిళల్లో 90 శాతం మంది సంతోషంగా లేరన్నదే నా అభిప్రాయం’ అని కనిష్కా సోని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని