ఆ విద్యార్థినులకు మళ్లీ ‘నీట్‌’ నిర్వహణ

కేరళలో ‘నీట్‌’ సమయంలో సిబ్బంది కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల సంస్థ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థినులకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం

Published : 28 Aug 2022 05:52 IST

లోదుస్తుల వివాదంతోనే...

కోజికోడ్‌: కేరళలో ‘నీట్‌’ సమయంలో సిబ్బంది కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల సంస్థ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థినులకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. బాధిత అమ్మాయిలకు సెప్టెంబరు 4న నీట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే వారికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం చేరవేసినట్లు తెలిపింది. వివిధ వైద్య కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ ఏడాది జులై 17న జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) సందర్భంగా... తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. కొల్లం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని