నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌ వాయిదా

పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం వచ్చే నెల 1 నుంచి జరగాల్సిన నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మరిన్ని కొత్త సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర

Published : 30 Aug 2022 04:23 IST

సెప్టెంబరు మూడో వారంలో జరిగే అవకాశం!

దిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం వచ్చే నెల 1 నుంచి జరగాల్సిన నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మరిన్ని కొత్త సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త షెడ్యూల్‌ను ప్రకటించనప్పటికీ, సెప్టెంబర్‌ మూడో వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘‘నీట్‌-పీజీ 2022 కౌన్సెలింగ్‌ సెప్టెంబరు ఒకటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఎన్‌ఎంసీ కొత్త అనుమతి పత్రాలు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్‌ 15తో ముగియనుంది. మరిన్ని సీట్లు కౌన్సెలింగ్‌లో చేరితే అభ్యర్థులుకు ప్రయోజనం కలుగుతుంది. అందుకే వాయిదా నిర్ణయం తీసుకున్నాం’’ అని మంత్రిత్వశాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని