పిల్లలకూ చుక్కల మందు టీకా.. మూడో దశ ప్రయోగాలకు అనుమతి కోరిన భారత్‌ బయోటెక్‌

5-18 ఏళ్ల వయసు వారికి ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు (ఇంట్రానాసల్‌) కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ (ఫేజ్‌-3) ప్రయోగాలు నిర్వహించేందుకు ఔషధ నియంత్రణ సంస్థ ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌

Updated : 12 Sep 2022 08:05 IST

దిల్లీ: 5-18 ఏళ్ల వయసు వారికి ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు (ఇంట్రానాసల్‌) కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ (ఫేజ్‌-3) ప్రయోగాలు నిర్వహించేందుకు ఔషధ నియంత్రణ సంస్థ ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా-డీసీజీఐ’ను భారత్‌ బయోటెక్‌ అనుమతి కోరింది. 18 ఏళ్లు పైబడిన వారికి ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కోవ్యాక్‌ (బీబీవీ154) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 6న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 5-18 ఏళ్ల వారికి మూడో దశ పరీక్షల్లో ఆయా వయసుల వారికి ఇది అందించే భద్రత, రోగనిరోధక శక్తి తదితరాలపై మదింపు జరుపుతారు. కొవాగ్జిన్‌తో బీబీవీ154 రోగ నిరోధక శక్తి, భద్రతను పోల్చి చూసేందుకు మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. దేశంలో 9 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని