‘అన్నం అడిగితే మా అమ్మ కొడుతోంది సార్‌!’: పోలీస్‌స్టేషనులో బాలుడి ఫిర్యాదు

‘అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్‌’ అంటూ తల్లిపై ఫిర్యాదుతో పోలీస్‌స్టేషనుకు వచ్చిన 8 ఏళ్ల బాలుడిని చూసి బిహార్‌ పోలీసులు విస్తుపోయారు.

Updated : 14 Sep 2022 09:34 IST

సీతామఢీ (బిహార్‌): ‘అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్‌’ అంటూ తల్లిపై ఫిర్యాదుతో పోలీస్‌స్టేషనుకు వచ్చిన 8 ఏళ్ల బాలుడిని చూసి బిహార్‌ పోలీసులు విస్తుపోయారు. సీతామఢీలోని చంద్రిక మార్కెట్‌ వీధి సిటీ పోలీసుల ముందు ఏడుస్తూ నిలుచున్న ఆ చిన్నారిని చూసి ఏమిచేయాలో కాసేపు వారికి పాలు పోలేదు. ముందుగా కడుపు నిండా అన్నం పెట్టారు. వివరాలు ఆరా తీస్తే.. తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరోచోట ఉంటాడని బాలుడు తెలిపాడు. చెప్పిన చిరునామా ప్రకారం పోలీసులు ఆ బాలుణ్ని ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిని విచారించగా.. అలాంటిదేం లేదని, ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని ఆమె చెప్పారు. ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి తాము వెనుదిరిగినట్లు పోలీసు అధికారి రాకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ వ్యవహారం తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని