Supremecourt: అసాధారణ పరిస్థితుల్లో అలా మంజూరు చేయవచ్చు: సుప్రీంకోర్టు వ్యాఖ్య

వెనకటి తేదీతో పర్యావరణ అనుమతుల్ని జారీ చేయడాన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం నిషేధించడం లేదని, అసాధారణ సందర్భాల్లో అలా చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆయా యూనిట్లపై

Updated : 23 Sep 2022 09:21 IST

దిల్లీ: వెనకటి తేదీతో పర్యావరణ అనుమతుల్ని జారీ చేయడాన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం నిషేధించడం లేదని, అసాధారణ సందర్భాల్లో అలా చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆయా యూనిట్లపై ఆధారపడే వందల మంది ఉద్యోగుల జీవనోపాధిని, ఆర్థిక రంగాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను న్యాయస్థానాలు విస్మరించజాలవని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిల ధర్మాసనం పేర్కొంది. యథాలాపంగా ఇలాంటి అనుమతులు ఇవ్వరాదని పేర్కొంది. పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన-2006 నిబంధనల్ని పాటించడం లేదనే కారణంతో బయో మెడికల్‌ వ్యర్థాల శుద్ధి కర్మాగారం మూసివేతకు ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తోసిపుచ్చడంపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఆ కర్మాగారం ద్వారా కాలుష్యం వెలువడుతున్నట్లయితే భారీ జరిమానా వేయవచ్చనీ, ఆ కర్మాగారం కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా తలెత్తే పరిణామాలను పట్టించుకోకుండా.. తగిన ముందస్తు అనుమతుల పేరిట దానిని మూసివేయలేమని స్పష్టంచేసింది. 

32 ఏళ్ల భూవివాదానికి సుప్రీంకోర్టు పరిష్కారం
ముప్పై రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూవివాదాన్ని సుప్రీంకోర్టు గురువారం పరిష్కరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన హౌసింగ్‌ సొసైటీలోని 844 మంది సభ్యులకు దిల్లీ నగరానికి నడిబొడ్డున (సెక్టార్‌ 43) 1,800 చదరపు అడుగుల చొప్పున బహుళ అంతస్తుల ఫ్లాట్లు కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ‘న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్‌ అథారిటీ’ (నోయిడా)కి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని