ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రాజీవ్‌ బహల్‌

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌, కేంద్రప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిగా డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ

Published : 24 Sep 2022 05:14 IST

ఈనాడు, దిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌, కేంద్రప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిగా డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శుక్రవారం తెలిపింది. బహల్‌ చిన్నపిల్లల వైద్య నిపుణులు. ప్రజారోగ్య విభాగంలో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థలో శిశు, కౌమారదశ పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. మాతాశిశు ఆరోగ్యంపై పరిశోధనలను పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని