బలవంతపు మత మార్పిళ్లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

బలవంతపు మతమార్పిళ్లను నిరోధించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, న్యాయశాఖలకు జస్టిస్‌ ఎంఆర్‌ షా,

Published : 24 Sep 2022 05:39 IST

దిల్లీ: బలవంతపు మతమార్పిళ్లను నిరోధించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, న్యాయశాఖలకు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం నోటీసులిచ్చింది. నవంబరు 14లోగా సమాధానం తెలపాలని కోరింది. బెదిరింపులకు గురి చేస్తూ, బహుమతులు పంచిపెడుతూ, నగదు ప్రయోజనాలు కలిగిస్తూ మోసపూరితంగా జరుగుతున్న మతమార్పిళ్లను అడ్డుకునేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  

‘370’ రద్దుపై పిటిషన్లను దసరా తరవాత జాబితాలో చేరుస్తాం

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే 370 అధికరణాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను దసరా తరవాత విచారణ జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. ఈ వ్యాజ్యాలను వేసవి సెలవుల తరవాత ‘జాబితా’లో చేరుస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ అమలుకాలేదంటూ సంబంధిత న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఈ మేరకు ధర్మాసనం స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని