మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి ఐదేళ్ల జైలుశిక్ష
రెండున్నర దశాబ్దాలకుపైగా నలుగుతూ వచ్చిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి... అలహాబాద్ హైకోర్టుకు చెందిన లఖ్‌నవూ బెంచ్ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల
గ్యాంగ్స్టర్స్ చట్టం కేసులో తీర్పు
లఖ్‌నవూ: రెండున్నర దశాబ్దాలకుపైగా నలుగుతూ వచ్చిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి... అలహాబాద్ హైకోర్టుకు చెందిన లఖ్‌నవూ బెంచ్ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ డి.కె.సింగ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. గ్యాంగ్స్టర్స్ యాక్ట్ కింద 1999లో లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్ ఠాణాలో ముఖ్తార్‌పై కేసు నమోదయింది. దీనిపై విచారణ చేపట్టిన ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానం 2020లో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై పునఃసమీక్ష చేపట్టిన లఖ్‌నవూ బెంచ్ ఆ తీర్పును కొట్టేసింది. మాజీ ఎమ్మెల్యే గ్యాంగ్‌స్టర్‌గా వ్యవహరిస్తూ పలు నేరాలకు పాల్పడినట్టు గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ న్యాయమూర్తి ఆయన్ను దోషిగా ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!