జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సేవలు చిరస్మరణీయం

మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ అత్యంత నిబద్ధతతో చిరస్మరణీయమైన సేవలందించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌ కొనియాడారు. న్యాయ సమాజంలో ఆమెను మణిరత్నంగా అభివర్ణించారు. జస్టిస్‌

Published : 24 Sep 2022 05:39 IST

సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ ప్రశంసలు
పదవీ విరమణ చేసిన మహిళా న్యాయమూర్తికి వీడ్కోలు

దిల్లీ: మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ అత్యంత నిబద్ధతతో చిరస్మరణీయమైన సేవలందించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌ కొనియాడారు. న్యాయ సమాజంలో ఆమెను మణిరత్నంగా అభివర్ణించారు. జస్టిస్‌ ఇందిరా బెనర్జీ పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ ప్రసంగించారు. ఐపీఎస్‌ అధికారి కుమార్తెను అయిన తాను అనుకోకుండా న్యాయవాద వృత్తిలో ప్రవేశించానని, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవిని చేపడతానని ఆనాడు ఊహించలేదని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తెలిపారు. అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ...జస్టిస్‌ ఇందిరా బెనర్జీ కోర్టును అద్భుతంగా నిర్వహించే వారని తెలిపారు. మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అత్యంత పేరు ప్రఖ్యాతులు గడించారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని