Blackmail: బాత్రూంలో విద్యార్థిని వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌

విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, బాత్రూంలోకి వెళ్లి దుస్తులు మార్చుకొంటున్న విద్యార్థిని(19)ని ఆమె సహాధ్యాయులు ముగ్గురు వీడియో తీశారు. తర్వాత ఆ వీడియో చూపించి ఆమె నుంచి

Updated : 25 Sep 2022 07:23 IST

భోపాల్‌: విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, బాత్రూంలోకి వెళ్లి దుస్తులు మార్చుకొంటున్న విద్యార్థిని(19)ని ఆమె సహాధ్యాయులు ముగ్గురు వీడియో తీశారు. తర్వాత ఆ వీడియో చూపించి ఆమె నుంచి రూ.7 వేలు వసూలు చేసేందుకు వారు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నిందితుల్లో ఓ యువకుణ్ని అరెస్టు చేసిన పోలీసులు మిగతా ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. భోపాల్‌లోని గోవింద్‌పురా ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లో సెప్టెంబరు 17న వీడియో చిత్రీకరణ జరిగింది. వీడియో గురించి తెలిసి తీవ్రంగా కలత చెందిన విద్యార్థిని ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ‘మిస్సింగ్‌’ ఫిర్యాదుతో భోపాల్‌ రైల్వేస్టేషనులో ఆమెను గుర్తించిన పోలీసులు తెర వెనుక కథంతా బయటకు లాగారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని