గ్యాంగ్‌స్టర్ల నియామకానికి ఫేస్‌బుక్‌లో ప్రకటన!

పంజాబ్‌లోని ఓ గ్యాంగ్‌స్టర్‌ వర్గం ఫేస్‌బుక్‌ ద్వారా చేసిన ప్రకటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తమ ముఠాలో చేరాలనుకునేవారు ఫలానా వాట్సాప్‌ నంబరుకు సందేశం పంపాలంటూ.. నంబరు జత చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

Updated : 25 Sep 2022 09:48 IST

పంజాబ్‌లోని ఓ గ్యాంగ్‌స్టర్‌ వర్గం ఫేస్‌బుక్‌ ద్వారా చేసిన ప్రకటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తమ ముఠాలో చేరాలనుకునేవారు ఫలానా వాట్సాప్‌ నంబరుకు సందేశం పంపాలంటూ.. నంబరు జత చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఈ ప్రకటన వైరల్‌గా మారింది. పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పలువురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రధాన గ్యాంగ్‌స్టర్‌ గ్రూపులైన లారెన్స్‌ బిష్ణోయ్‌, బాంబిహాలకు చెందినవారు పరస్పరం సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో బాంబిహా గ్రూప్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇవ్వడం గమనార్హం. బఠిండా పోలీసుల చేతిలో రాంపురాఫూల్‌లో ఎన్‌కౌంటర్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ దేవేందర్‌ బాంబిహా. షార్ప్‌ షూటర్‌గా ప్రసిద్ధి. గుజరాత్‌, మహారాష్ట్రలోని అనేక క్రిమినల్‌ గ్యాంగులతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఆర్మేనియా నుంచి బాంబిహా ముఠా కార్యకలాపాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. దేవేందర్‌ బాంబిహా పేరుతో బాంబిహా గ్యాంగ్‌స్టర్‌ గ్రూపు ఫేస్‌బుక్‌ ప్రకటన చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts