ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే.. పీఎఫ్‌ఐ లక్ష్యం

భారత్‌పై జిహాద్‌ ప్రకటించి.. తద్వారా దేశంలో ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంగా పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) ప్రణాళికలు రచిస్తోందని  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పేర్కొంది. గురువారం దేశవ్యాప్తంగా

Updated : 25 Sep 2022 05:44 IST

లష్కరే, ఐసిస్‌లతో ఆ సంస్థకు సంబంధాలు

యువతను ఉగ్రబాట పట్టిస్తోంది

ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఐఏ నివేదిక

కోచి: భారత్‌పై జిహాద్‌ ప్రకటించి.. తద్వారా దేశంలో ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంగా పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) ప్రణాళికలు రచిస్తోందని  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పేర్కొంది. గురువారం దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నేతల నివాసాలపై ఎన్‌ఐఏ దాడులు చేసిన సంగతి తెలిసిందే. శనివారం పది మంది పీఎఫ్‌ఐ నాయకులను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి.. వారి కస్టడీ కోరింది. ఇందుకు సంబంధించిన రిమాండు నివేదికను గురువారమే సమర్పించింది. ఇందులో పీఎఫ్‌ఐపై ఎన్‌ఐఏ తీవ్రాభియోగాలు మోపింది. తాము నిర్వహించిన దాడుల్లో దేశ సమగ్రతకు భంగం కలిగించే కీలక పత్రాలు లభించాయని పేర్కొంది. ఒక వర్గానికి  చెందిన ప్రముఖ నేతలను హత్య చేసేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నిందని, ఇందుకోసం ఓ జాబితాను రూపొందించిందని నివేదికలో ఎన్‌ఐఏ ఆరోపించింది. లష్కరే తొయిబా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌), అల్‌ఖైదా లాంటి ఉగ్రసంస్థలతో పీఎఫ్‌ఐకు సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థల్లో  భారతీయ యువత చేరేలా ప్రోత్సహిస్తోందని పేర్కొంది. భారత్‌పై జిహాద్‌ ప్రకటించి.. ఉగ్రచర్యలతో ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించాలని పన్నాగం పన్నిందని తెలిపింది. నివేదికను పరిశీలించిన న్యాయస్థానం నిందితులను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని