ఫెదరర్‌ జీవితం నేర్పే పాఠాలు

టెన్నిస్‌ క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్‌ రిటైర్మెంట్‌ సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: 1.నిరంతర శ్రమను సంతోషంగా స్వీకరించండి 2.ఉన్నత విలువలతో జీవితాన్ని కొనసాగించండి 3.సరైన సమయంలో రిటైర్‌ అవ్వండి 4.పోటీదారులు

Published : 25 Sep 2022 05:33 IST

టెన్నిస్‌ క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్‌ రిటైర్మెంట్‌ సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: 1.నిరంతర శ్రమను సంతోషంగా స్వీకరించండి 2.ఉన్నత విలువలతో జీవితాన్ని కొనసాగించండి 3.సరైన సమయంలో రిటైర్‌ అవ్వండి 4.పోటీదారులు మీకోసం ఏడవడానికి మించిన గొప్ప విజయం ఇంకేదీ లేదు 5.బరిలో పోటీ, పోటీదారుల మధ్య స్నేహం రెండూ సాధ్యమే 6.మగవారూ ఏడుస్తారు. భావోద్వేగాలకు సంబంధించి వారు కూడా దుర్బలులే.  

 - హర్ష్‌ గోయెంకా


రూపాయి విలువ క్షీణతను తేలిగ్గా తీసుకోవద్దు

ప్రపంచ మార్కెట్‌లో భారత రూపాయి విలువ నిరంతర పతనంతో దేశ ప్రభుత్వ ప్రతిష్ఠకు కలిగే నష్టమేమీ ఉండకపోవచ్చు. కానీ దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. నైతికత కూడా దెబ్బతింటుంది. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగంలాగా రూపాయి విలువ క్షీణతను కూడా ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకూడదు.    

  - మాయావతి


అంతరిక్షంలోనూ మహిళలపై వివక్ష

మహిళలు అంతరిక్షంలోనూ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. 90వ దశకంలో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో మహిళల ప్రాతినిధ్యం 20 శాతం ఉండేది. 2021లోనూ ఈ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం శోచనీయం. 

      - సంగీతా రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు