సముద్ర గర్భ సొరంగానికి మళ్లీ బిడ్లు

దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టనున్న సముద్ర గర్భ సొరంగం నిర్మాణానికి మళ్లీ కదలిక వచ్చింది. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నిర్మించనున్న హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో భాగంగా ఉన్న ఈ పనులకు ‘నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే

Published : 25 Sep 2022 05:33 IST

దిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టనున్న సముద్ర గర్భ సొరంగం నిర్మాణానికి మళ్లీ కదలిక వచ్చింది. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నిర్మించనున్న హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో భాగంగా ఉన్న ఈ పనులకు ‘నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) బిడ్లను ఆహ్వానించింది. కారిడార్‌లో భాగంగా 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తవ్వనున్నారు. ఇందులో 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో ఉంటుంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్‌ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. 2019లో సొరంగం నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌  తొలిసారిగా టెండర్లు ఆహ్వానించినా బిడ్డర్లెవరూ ఆసక్తి చూపలేదు. గత నవంబరులోనూ ఈ సొరంగ మార్గాల ఏర్పాటుకు మరోసారి బిడ్లను ఆహ్వానించింది. పరిపాలనాపరమైన కారణాలతో అవి కార్యరూపం దాల్చలేదు. హైస్పీడ్‌ రైలు కారిడార్‌ పనులను నాలుగేళ్లలోపు పూర్తిచేసి 2026లో తొలిదశ ప్రయోగపరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు