Triple talaq: ట్రిపుల్‌ తలాఖ్‌కు.. ‘పుష్ప’ జవాబు

తొమ్మిదేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకొన్న భర్త షోయబ్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ముగ్గురు కుమారుల తల్లి అయిన రుబీనాఖాన్‌ కాస్తా ‘పుష్ప’గా మారి.. భర్త స్నేహితుడు ప్రేమ్‌పాల్‌ గంగ్వార్‌ను

Updated : 25 Sep 2022 07:34 IST

బరేలీ (యూపీ): తొమ్మిదేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకొన్న భర్త షోయబ్‌ ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ముగ్గురు కుమారుల తల్లి అయిన రుబీనాఖాన్‌ కాస్తా ‘పుష్ప’గా మారి.. భర్త స్నేహితుడు ప్రేమ్‌పాల్‌ గంగ్వార్‌ను మారు మనువాడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ నగరం నవాబ్‌గంజ్‌లో శుక్రవారం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగింది. వాహన డ్రైవరుగా పనిచేసే షోయబ్‌ తనపై అనుమానంతో తరచూ వేధించేవాడని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట ‘తలాఖ్‌’ చెబుతూ రుబీనాను ఇంటి నుంచి భర్త వెళ్లగొట్టాడు. షోయబ్‌ కారణంగా పరిచయమైన ప్రేమ్‌పాల్‌ తనను ఆదరించడంతో ఆమె ‘పుష్ప’గా మారి కొత్తజీవితం మొదలుపెట్టింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని