అనారోగ్యంతో బాధపడే మూగజీవుల నేస్తం

అనారోగ్యంతో మూలిగే మూగజీవులను ఇంటికి తీసుకొచ్చి, సపర్యలు చేస్తున్నారు... బిలాస్‌పుర్‌లోని కుడుదండ్‌ శివ్‌చౌక్‌కు చెందిన 27 ఏళ్ల నిధి తివారి. వృద్ధాప్యంతో, అనారోగ్యంతో ఉన్న శునకాలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను

Published : 25 Sep 2022 05:33 IST

బిలాస్‌పుర్‌: అనారోగ్యంతో మూలిగే మూగజీవులను ఇంటికి తీసుకొచ్చి, సపర్యలు చేస్తున్నారు... బిలాస్‌పుర్‌లోని కుడుదండ్‌ శివ్‌చౌక్‌కు చెందిన 27 ఏళ్ల నిధి తివారి. వృద్ధాప్యంతో, అనారోగ్యంతో ఉన్న శునకాలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను కొందరు వీధుల్లో వదిలేస్తుంటారు. దీంతో ఒక్కసారిగా వాటి బతుకు అయోమయంగా మారిపోతుంది. తిండి లేక, ఆరోగ్యం కుదుటపడక అవి నానాటికీ బక్కచిక్కిపోతుంటాయి. తన కంట పడిన అలాంటి జంతువులకు... నిధి అన్నీ తానై చూసుకుంటున్నారు. వాటికి చక్కటి వైద్యం అందించి, ఆహారం అందిస్తున్నారు. ఇలాంటి మూగ జీవులను సాకేందుకు ఏకంగా మూడు అంతస్తుల భవనాన్ని కేటాయించారు. పోలీసులు, అటవీ అధికారులు, ప్రజలు ఇలాంటి జీవాలను చూసి తనకు సమాచారం ఇస్తుంటారని ఆమె తెలిపారు. ఓసారి గుడిలో బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న మేకను రక్షించేందుకు మనేకా గాంధీ తనకు సాయం చేసినట్టు తెలిపారు. నిధి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రేమతో ఈ పెంపుడు జంతువులను చూసుకుంటుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని