Chanchal sharma: బిడ్డను కట్టుకుని ఈ-రిక్షా నడుపుతూ...

జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్త మధ్యలోనే వదిలేశాడు. దీంతో కన్న కొడుకుతో రోడ్డున పడింది నొయిడాకు చెందిన చంచల్‌ శర్మ (27). వృద్ధురాలైన తల్లి, ముగ్గురు తోబుట్టువులపై ఆధారపడలేని పరిస్థితి. దీంతో తన కాళ్లపై

Updated : 25 Sep 2022 08:44 IST

నోయిడా: జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్త మధ్యలోనే వదిలేశాడు. దీంతో కన్న కొడుకుతో రోడ్డున పడింది నొయిడాకు చెందిన చంచల్‌ శర్మ (27). వృద్ధురాలైన తల్లి, ముగ్గురు తోబుట్టువులపై ఆధారపడలేని పరిస్థితి. దీంతో తన కాళ్లపై తాను నిలబడాలనుకుందామె. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకుండా ఈ-రిక్షా నడపాలని నిర్ణయించుకుంది. గాజియాబాద్‌లో ఉంటున్న ఆమె తెల్లవారుజామునే తన చిన్నారి కొడుకును చున్నీతో ఛాతీకి కట్టుకుని... ఉదయం 6.30 గంటలకల్లా సెక్టార్‌-62 లోని మెట్రో ఎలక్ట్రానిక్‌ సిటీకి వస్తుంది. అక్కడ రోజుకు రూ.300కి ఈ-రిక్షాను అద్దెకు తీసుకుని నడుపుతోంది. ఇలా రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకూ సంపాదిస్తోంది. నిజాయితీగా చేసే ఏపనీ తక్కువ కాదంటూ నిండైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts